నీలం మధు ముదిరాజ్‌కు గ్రామస్తుల అభినందనలు
తెర్పోల్, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
తెర్పోల్ గ్రామంలో పునర్నిర్మాణం చేపడుతున్న హనుమాన్ మందిరానికి గజస్తంభం ఏర్పాటు చేయిస్తానని మెదక్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
మందిర పునర్నిర్మాణానికి సహకరిస్తూ గజస్తంభం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చిన నీలం మధు ముదిరాజ్‌కు గ్రామ ప్రజలు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయ అభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply