పినపాక పట్టణ ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి
పినపాక, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పినపాక పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలోని పలు వార్డుల్లో ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా 7వ వార్డులో అంగన్వాడీ కేంద్రం సమీపంలోని గుంతలను వెంటనే పూడ్చాలని వారు కోరుతున్నారు.
అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. గతంలో నీటి సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినప్పటికీ, నెల రోజులు గడుస్తున్నా సమస్యపై తగిన చర్యలు కనిపించడం లేదని వారు వాపోతున్నారు.

తాగునీటి సమస్యతో పాటు రోడ్ల గుంతల సమస్యపై ఏఈ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, ప్రతి వార్డులో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను గుర్తించి ప్రాధాన్యతతో పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.









Leave a Reply