Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు
Home › బ్రేకింగ్ న్యూస్ › హైదరాబాద్‌లో గ్రీన్, రీసైకిల్ టాయిలెట్ల ప్రారంభం
బ్రేకింగ్ న్యూస్

హైదరాబాద్‌లో గ్రీన్, రీసైకిల్ టాయిలెట్ల ప్రారంభం

04:45 సాయంత్రం PM

గేట్స్ ఫౌండేషన్ సాంకేతికతతో నెట్‌జీరో టాయిలెట్లు.. లుంబినీ పార్కులో తొలి యూనిట్ల ఏర్పాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం మరో ఆధునిక సాంకేతికతకు వేదికగా మారింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ అభివృద్ధి చేసిన నీటి పునర్వినియోగ సాంకేతికత ఆధారంగా రూపొందించిన నెట్‌జీరో, గ్రీన్ టాయిలెట్లను నగరంలో ఉత్పత్తి చేయనున్నారు.

పర్యావరణ అనుకూల సాంకేతిక సంస్థ రీ ఫ్లో, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీ-వర్క్స్, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అత్యాధునిక గ్రీన్ టాయిలెట్లను తయారు చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలకు సరఫరా చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్రీన్ టాయిలెట్లను హైదరాబాద్‌లోని లుంబినీ పార్కులో ఏర్పాటు చేశారు. నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించుకునే నెట్‌జీరో టాయిలెట్ల సముదాయాన్ని ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

సుమారు రూ.కోటితో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్లను అవసరమైన ప్రాంతాలకు తరలించే విధంగా రూపొందించినట్లు తెలిపారు. రీ ఫ్లో సంస్థ టీ-వర్క్స్‌తో కలిసి ఈ టాయిలెట్లను హైదరాబాద్‌లోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

సోలార్ విద్యుత్‌తో పనిచేసే ఈ టాయిలెట్లకు ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ అవసరం లేదని మంత్రి తెలిపారు. ఒకసారి ట్యాంకులో నీటిని నింపితే అదే నీటిని పలు దఫాలు శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునే విధంగా సాంకేతికతను రూపొందించినట్లు వివరించారు.

ఈ సాంకేతికతను ఉచితంగా అందిస్తున్న గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులను శ్రీధర్ బాబు అభినందించారు. ఇప్పటికే 50 యూనిట్ల రీసైకిల్ టాయిలెట్లకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించారు.

గేట్స్ ఫౌండేషన్ పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన సాంకేతికత ఉచితంగా అందుబాటులోకి రావడంతో ఈ టాయిలెట్లను తక్కువ ధరకు అందించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. తక్కువ నీటి వినియోగం, ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ అవసరం లేకపోవడం వంటి లక్షణాల కారణంగా వీటిని వివిధ ప్రాంతాల్లో ఉపయోగించవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అర్చనా వ్యాస్, రీ ఫ్లో ప్రతినిధి అభిషేక్, టీ-వర్క్స్ సీఈఓ జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 29🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App