మైనంపల్లి హనుమంత్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరిక
నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): నేరేడ్‌మెట్ తాజా మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజానాయకుడు మైనంపల్లి హనుమంత్ నాయకత్వంపై విశ్వాసంతో కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన తెలిపారు.

ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, కష్టసమయాల్లో ప్రజలకు అండగా నిలవడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు తనను మైనంపల్లి హనుమంత్ నాయకత్వం వైపు ఆకర్షించాయని ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.
మైనంపల్లి హనుమంత్ ప్రజల సమస్యలపై స్పందిస్తూ, పదవులతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉండే నాయకుడిగా తనకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి అండగా నిలుస్తారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు, నేరేడ్‌మెట్‌లో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు, కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు.
“మైనంపల్లి హనుమంత్ నాయకత్వంలో ప్రజాసేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం గర్వంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం నా శక్తివంచన లేకుండా పనిచేస్తాను” అని ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.









Leave a Reply