Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › 🚨 పోలీస్ స్టేషన్‌లోనే పోలీస్ వాహనం చోరీ.. గంజాయి మత్తులో యువకుడి హల్‌చల్
బ్రేకింగ్ న్యూస్

🚨 పోలీస్ స్టేషన్‌లోనే పోలీస్ వాహనం చోరీ.. గంజాయి మత్తులో యువకుడి హల్‌చల్

04:26 సాయంత్రం PM

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీకి గురైన ఘటన కలకలం రేపింది. గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం.

వాహనం కనిపించకుండా పోవడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సదరు యువకుడు వాహనాన్ని ర్యాష్‌గా నడుపుతూ ఎల్కతుర్తి సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

అనంతరం పోలీస్ క్యాప్ ధరించి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఎల్కతుర్తి పోలీసులు కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.

అప్పటికే పోలీస్ వాహనం మిస్సింగ్‌పై కరీంనగర్ పోలీసులు గాలింపు చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎల్కతుర్తి పోలీసులు వాహనంతో పాటు యువకుడిని కరీంనగర్‌కు తరలించినట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, కరీంనగర్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 64🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *