ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీకి చలో.. బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీ పయనం!
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం.. ఓటు హక్కుల కోసం కాంగ్రెస్ సమరశంఖం
ఓటు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు చందు క్యాసగళ్ల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమ్మెల్యే బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీ ప్రయాణం ప్రారంభించారు.
నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొని, ఓటు హక్కుల పరిరక్షణ కోసం తమ గళాన్ని బలంగా వినిపించనున్నట్లు తెలిపారు.
ఓటు హక్కుల కోసం సమరం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం!
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని, ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బలంగా చాటాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ గళం.. ఢిల్లీలో ప్రతిధ్వనించాలి!
చందు క్యాసగళ్ల యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు.










Leave a Reply