– సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళి
దేవరకొండ,01 నవంబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
దేశ సమైక్యత, సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ‘ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ (ఉక్కు మనిషి) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేవరకొండలో శుక్రవారం ‘ఏక్తా దివస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నాయకులు, స్థానిక ప్రజలు సర్దార్ పటేల్ చిత్రపటానికి మరియు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కంబాలపల్లీ రేంజ్ సెక్షన్ ఆఫీసర్ పి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ… భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేసిన సాటిలేని సేవలను స్మరించుకున్నారు. వందలాది స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి, అఖండ భారతదేశ నిర్మాణానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశ ఐక్యతను, భద్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
దేవరకొండ పట్టణంలోని కంబాలపల్లీ రేంజ్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీట్ అధికారులు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే దేశభక్తిని చాటుతూ పలువురు యువకులు, సంఘం ప్రతినిధులు, ప్రముఖులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.










Leave a Reply