జాతీయ సమైక్యతకు సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం
ఉక్కు మనిషి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ, కమిషనర్ రామదుర్గారెడ్డి
దేవరకొండ, అక్టోబర్ 31 (AYUSH24 NEWS): భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి అన్నారు.
భారత తొలి ఉప ప్రధాని, భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ పటేల్, దేశంలోని వందలాది సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతదేశ ఐక్యతకు బలమైన పునాది వేశారని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, దూరదృష్టి, దేశ సమైక్యత కోసం చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply