దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఎంతో పవిత్రమైన కార్తీక మాసం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అమరావతి(అమరలింగేశ్వర స్వామి దేవాలయం),
భీమవరం(సోమేశ్వర స్వామి దేవాలయం),
పాలకొల్లు( క్షీర లింగేశ్వర స్వామి దేవాలయం),
ద్రాక్షారామం( భీమేశ్వర స్వామి దేవాలయం),
సామర్లకోట( భీమలింగేశ్వర స్వామి దేవాలయం)
లను ఒకే రోజు దర్శించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ప్రత్యేకంగా కల్పించడం జరిగిందన్నారు. పెద్దలకు రూ.2200, పిల్లలకు రూ.1200 చార్జీలు వర్తిస్తాయని తెలిపారు.ఈనెల 15,22,29 మరియు డిసెంబర్ 6 తేదీల్లో ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించి శివ కేశవుల ఆశీస్సులు పొందాలని కోరారు. మరియు తెలంగాణలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు కూడా ప్రత్యేకంగా భక్తుల కోరిక మేరకు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. బుకింగ్ కోసం 9848847419, 9949026631,
9666599890,
7382832833 ఫోన్ నెంబర్ లను సంప్రదించాలని కోరారు











Leave a Reply