Saturday, 07 Nov 2026
07 Nov 2026Saturday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నేరడుగొమ్ములో రూ.15 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనం● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్● నేరడుగొమ్ములో రూ.15 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనం● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్
Home › బ్రేకింగ్ న్యూస్ › పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ
బ్రేకింగ్ న్యూస్

పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ

పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ పీఏ పల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శనివారం పీఏ పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు.

03:45 మధ్యాహ్నం PM

పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ
పీఏ పల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శనివారం పీఏ పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించడంతో పాటు నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేసి శంకుస్థాపనలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం
పీఏ పల్లి మండలంలోని అంగడిపేట గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. అనంతరం రాంపురం గ్రామంలోని నేనావత్ తండాలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి భూ సమస్యలను తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రూ.13 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు
పిల్లిగుండ్ల తండా గ్రామంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా డ్రైనేజీ కాలువల నిర్మాణానికి రూ.13 లక్షల నిధుల మంజూరు విషయమై జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే ప్రజల సమక్షంలో ఫోన్ ద్వారా మాట్లాడారు. డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలోని ఇతర సమస్యలను కూడా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు.
గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ
మాదారిగూడెం గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు రంగారెడ్డి గూడెం గేటు వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ప్రజల సమక్షంలోనే ఆర్టీసీ డీఎంతో ఫోన్‌లో మాట్లాడి ప్రయాణికుల ఇబ్బందులను వివరించారు. బస్సులు ఆగేలా సమస్యను పరిష్కరించాలని కోరగా, చర్యలు తీసుకుంటామని డీఎం హామీ ఇచ్చారు.
అనంతరం పిల్లిగుండ్ల తండాలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించి, నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యత
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సమస్యల పరిష్కారం, పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చే సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేర్మటి సతీష్ రెడ్డి, ఏవీ రెడ్డి, కుక్కల గోవర్ధన్ రెడ్డి, వీరబోయిన ఎల్లయ్య యాదవ్, మద్దిమడుగు రామస్వామి, తేరా సత్యం రెడ్డి, వంగాల ప్రతాపరెడ్డి, పాల్వాయి వెంకట్ రెడ్డి, బోడ్య నాయక్, తూటిపల్లి నగేష్, మావిల్ల లక్ష్మీనారాయణ, రామావత్ చిరంజీవి, నేనావత్ అనిత లక్ష్మణ్, ఇస్లావత్ బుజ్జి నాగు నాయక్, రాగం అంజయ్య, రామావత్ నారాయణ, మండల సర్పంచులు, ఉపసర్పంచులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Ayush 24 News | దేవరకొండ

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
306 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App