Sunday, 01 Nov 2026
01 Nov 2026Sunday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● కొత్తగూడెంలో రెండు తెలుగు రాష్ట్రాల టాలెంట్ షో పోటీలు● కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత● వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం● ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీకి …చలో బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీ పయనం!● జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం● చలో ఢిల్లీ.. రాంలీలా మైదానంలో ఓటు చోర్‌పై నిరసన దీక్ష, ర్యాలీకి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బయలుదేరిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు● దేవరకొండ పట్టణంలో ఘనంగా సిరత్-ఏ-నబీ జల్సా ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది● దేవరకొండలో ఘనంగా ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలు● కొత్తగూడెంలో రెండు తెలుగు రాష్ట్రాల టాలెంట్ షో పోటీలు● కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత● వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం● ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీకి …చలో బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీ పయనం!● జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం● చలో ఢిల్లీ.. రాంలీలా మైదానంలో ఓటు చోర్‌పై నిరసన దీక్ష, ర్యాలీకి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బయలుదేరిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు● దేవరకొండ పట్టణంలో ఘనంగా సిరత్-ఏ-నబీ జల్సా ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది● దేవరకొండలో ఘనంగా ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలు
Home › ఉమ్మడి నల్లగొండ › దేవరకొండ పట్టణంలో ఘనంగా సిరత్-ఏ-నబీ జల్సా ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
ఉమ్మడి నల్లగొండ

దేవరకొండ పట్టణంలో ఘనంగా సిరత్-ఏ-నబీ జల్సా ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

05:31 తెల్లవారుజాము AM

దేవరకొండలో ఘనంగా సీరత్-ఎ-నబీ జల్సా – పేద ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహాలు

దేవరకొండ: పట్టణంలోని అక్సా మసీదు ప్రాంగణంలో ఆదివారం రాత్రి సీరత్-ఎ-నబీ జల్సా మరియు నిరుపేద ముస్లిం కుటుంబాలకు చెందిన యువతీ యువకుల సామూహిక వివాహాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య అతిథులు, మతపెద్దలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పవిత్ర జీవితం, బోధనలు, ఆదర్శాలు, మానవత్వం, సోదరభావం, శాంతి, సహనం వంటి విలువలపై మతపెద్దలు ప్రసంగించారు. ఇస్లాం మతంలోని పలు ముఖ్యమైన అంశాలను వివరిస్తూ సమాజంలో ఐక్యత, సేవాభావం, పేదల పట్ల ఆదరణ పెంపొందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి జమాతే ఉలేమియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయ మౌలానా జనాబ్ మొహమ్మద్ ఏసానుద్దీన్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. అనంతరం పేద ముస్లిం కుటుంబాలకు చెందిన యువతీ యువకుల నిఖా కార్యక్రమం నిర్వహించి, నూతన దంపతుల సుఖసంతోషాల కోసం ప్రత్యేక దువా చేశారు. నమాజ్ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి సభను విజయవంతంగా ముగించారు.

ఈ కార్యక్రమంలో జమాతే ఉలేమియా రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ మొహమ్మద్ ఏసానుద్దీన్, దేవరకొండ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ముఫ్తీ అంజాద్, ముఫ్తీ రిజ్వాన్, మిస్బా ఉలూమ్ నాజిం హఫీజ్ సాదిక్ హుస్సేన్, హఫీజ్ హబీబ్, మౌలానా నజీర్, హాఫిజ్ అలీముద్దీన్, మక్కా మసీదు మరియు ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీముద్దీన్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇలియాస్ పటేల్, ఎం.ఏ. అంజాద్ (ఇండియన్ టెంట్ హౌస్ ఈవెంట్ ఆర్గనైజర్), దేవరకొండ పట్టణ, మండల పరిధిలోని వివిధ మసీదుల ఇమాములు పాల్గొన్నారు.

అలాగే దేవరకొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎం.డి. రహత్ అలీ, ఎం.డి. ఖాజా సాలార్ ఖదీర్, ఎం.డి. ముజీబ్, ఎం.డి. సలీం, ఎం.డి. ఉమర్ ఖాసిం, ఎం.డి. అఫ్రోజ్, సివిల్ కాంట్రాక్టర్ ఎం.డి. ఖాదర్, వివిధ పార్టీ నాయకులు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పట్టణంలోని ముస్లిం పెద్దలు, యువకులు, మసీదు కమిటీ సభ్యులు, నిర్వాహకులు విశేష సహకారం అందించారు. మతసామరస్యం, మానవత్వం, పేదలకు అండగా నిలవడం వంటి గొప్ప సందేశాలను చాటిచెప్పిన ఈ కార్యక్రమం దేవరకొండ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
77 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App