యాదాద్రి భువనగిరి | అయుష్ 24 న్యూస్
యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.14 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కుకున్నారు. ఆలేరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకుమంతి పూర్ణచందర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన తరఫున కొలనుపాక గ్రామ జీపీఓ షేక్ అహ్మద్ లంచం స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి సోదరి విక్రయించిన భూమి రిజిస్ట్రేషన్‌కు అనుకూలంగా తహసీల్దార్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉండగా, అందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
లంచం మొత్తాన్ని కొలనుపాక గ్రామ జీపీఓ షేక్ అహ్మద్ ద్వారా స్వీకరించేందుకు అధికారులు ఒప్పందం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి నుంచి రూ.14 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి పట్టుకున్నారు.
తనిఖీల్లో లంచం మొత్తాన్ని రికవరీ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి నిందితులపై కేసు నమోదు చేశారు.
అరెస్టు చేసిన నిందితులను నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply