ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యం – నేరేడుగొమ్ము మండల కాంగ్రెస్ నాయకులు
Ayush 24 News | దేవరకొండ:
నూతనంగా ఏర్పడిన నేరేడుగొమ్ము మండలంలో ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో రూ.15 కోట్ల వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవన నిర్మాణం చేపడుతుండటం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమానికి ప్రత్యేక చొరవ చూపిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్‌ను నేరేడుగొమ్ము మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
గతంలో మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో ప్రజలు, రైతులు వివిధ ప్రభుత్వ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని నాయకులు తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక కృషితో రూ.15 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా సముదాయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో నేరేడుగొమ్ము మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్‌ను ఘనంగా సన్మానించి, మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఒకే చోట అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని, సమయం ఆదా అవుతుందని, రైతులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్మాణం నేరేడుగొమ్ము మండల అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
జిల్లా ఉపాధ్యక్షులు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి లోకసాని కృష్ణయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాంకునావత్ బిక్కు నాయక్, గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య యాదవ్, కేతావత్ సోమాని, కొప్పుల సురేందర్ రెడ్డి, పులికంటి సుధాకర్, కేతావత్ రమేష్, నేనావత్ బాలు, రామావత్ బాబురామ్ నాయక్, గన్ను నాయక్, నీలం ఆంజనేయులు యాదవ్, నేనావత్ రాంజా నాయక్, ఎలిజర్ల శ్రీను, ముక్కమల్ల శేఖర్ గౌడ్, పంబాల పర్వతాలు, జర్పుల మకట్ లాల్, కుంభం రామకృష్ణ, నాగటి హరీష్, శ్రీపతి సైదులు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Ayush 24 News
ప్రజా వార్తలు.. ప్రజల కోసం..
రూ.15 కోట్లతో నేరేడుగొమ్ము ప్రభుత్వ కార్యాలయాల సముదాయం.. ఎమ్మెల్యే బాలు నాయక్‌కు ఘన సన్మానం
ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యం – నేరేడుగొమ్ము మండల కాంగ్రెస్ నాయకులు Ayush 24 News | దేవరకొండ: నూతనంగా ఏర్పడిన నేరేడుగొమ్ము మండలంలో ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో రూ.15 కోట్ల వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవన నిర్మాణం చేపడుతుండటం


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply