గూడూరు శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు
నూతనంగా చేరిన యువకులకు శాలువాలతో స్వాగతం
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి, AYUSH24 NEWS ప్రతినిధి:

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాపూర్ డివిజన్ శక్తి సాయి నగర్లో పలువురు యువకులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.
బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గూడూరు శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యువకులు పార్టీలో చేరగా, వారికి బీజేపీ నాయకులు శాలువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డి, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనాథ్ పాల్గొన్నారు.
అలాగే సీనియర్ నాయకులు ఎలిమినేటి మహేష్, కాటపల్లి రాజేందర్, రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల అధ్యక్షులు, శక్తి సాయి నగర్ డివిజన్ కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
AYUSH24 NEWS | తెలంగాణ | మల్కాజిగిరి | ఉప్పల్ నియోజకవర్గం | రాజకీయాలు










Leave a Reply