Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › Latest › ఓటరు జాబితా సవరణతో ప్రతి బూత్‌ను బలోపేతం చేయాలి
Latest

ఓటరు జాబితా సవరణతో ప్రతి బూత్‌ను బలోపేతం చేయాలి

02:48 తెల్లవారుజాము AM

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పగడాల కాళీ ప్రసాద్ రావు

పరకాల, ఆగస్టు 24 | అయుష్ 24 న్యూస్

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో దశలో భాగంగా ప్రతి బూత్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పగడాల కాళీ ప్రసాద్ రావు, SIR జిల్లా కన్వీనర్ రావు అమరేందర్ రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు డా. సిరంగి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

పరకాల స్వర్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన పరకాల అసెంబ్లీ నియోజకవర్గ SIR రెండో దశ కార్యశాలకు పరకాల పట్టణం, పరకాల రూరల్, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన BLA-2లు, బూత్ అధ్యక్షులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ SIR రెండో దశ ప్రక్రియపై పార్టీ శ్రేణులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ప్రతి బూత్‌ను రాజకీయంగా, సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా నింపని వారిని గుర్తించి, అవసరమైన గుర్తింపు పత్రాలతో ఫారాలను పూర్తి చేయించి సమర్పించేలా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే విధంగా, ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా నిరంతరం పరిశీలన చేయాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పేర్కొన్న నాయకులు, తప్పుల్లేని ఓటరు జాబితా రూపకల్పనకు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA), బూత్ అధ్యక్షులే పార్టీకి పట్టుకొమ్మలని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హమైన మరియు బోగస్ ఓట్లను గుర్తించి తొలగించేలా సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించారు.

బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసినప్పుడే రాజకీయంగా విజయాలు సాధ్యమవుతాయని, అందువల్ల SIR సవరణ ప్రక్రియను కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్.పీ. జయంతిలాల్, దేవునూరి మేఘనాథ్, పరకాల కౌన్సిలర్లు బెజ్జంకి పునాచారి, ఆకుల లావణ్య శ్రీధర్, మండల అధ్యక్షులు కాసగాని రాజ్‌కుమార్, ఉప్పుగల శ్రీకాంత్‌రెడ్డి, వేల్పుల రాజ్‌కుమార్, పరకాల మాజీ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య, నాగారం మాజీ సర్పంచ్ బాబన్న, ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి ఉడత చిరంజీవి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి కిరణ్, పరకాల పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, దంచనాదుల సత్యనారాయణ, ఓబీసీ పరకాల పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పైండ్ల రంజిత్, గుడిగంటి రఘుపతి గౌడ్, ఓబీసీ మాజీ ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామునూరు శ్రీనివాస్, ఆత్మకూరు మాజీ అధ్యక్షులు ఇరుసాల సదానందం, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్ పాల్గొన్నారు.

అలాగే బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దంచనాదుల కిరణ్, భయపడి రవ్వ శివప్రసాద్, సూరచందర్, గుండు ముఖేష్, గుండెబోయిన నరసయ్య, జంగిలి రాజేందర్‌రావు తదితర నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, BLA-2లు తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 5🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *