చింతపల్లి | నవంబర్ 07 | Ayush 24 News
చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన మలక్‌పేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అక్బర్ తండ్రి షేక్ సిద్దిక్ మృతి పట్ల దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
షేక్ సిద్దిక్ పార్థివదేహానికి ఎమ్మెల్యే బాలు నాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతతో ఉంటూ పార్టీకి అంకితభావంతో సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కొండూరు పవన్ కుమార్, అంగిరేకుల నాగభూషణం, ఏడుపుల గోవింద్ యాదవ్, కాయితీ జితేందర్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ యాదవ్, మాస భాస్కర్, అంగిరేకుల గోవర్ధన్, మారయ్య, శంకర్, బాలేమీయా, రాకేష్, లక్ష్మయ్య, హేము, మధు, నేనావత్ భరత్ కుమార్, నడింపల్లి సత్యం గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Ayush 24 News దేవరకొండ ప్రాంతీయ వార్తలు – ప్రజల గొంతుక
కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్
చింతపల్లి | నవంబర్ 07 | Ayush 24 News చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన మలక్‌పేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అక్బర్ తండ్రి షేక్ సిద్దిక్ మృతి పట్ల దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply