దేవరకొండ,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
దేవరకొండ పట్టణంలోని ప్రఖ్యాత కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం ప్రతిభా వికాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ శ్రీ గరికిపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల ప్రతిభా వికాసం గురించి అమూల్యమైన ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనాటి కాలం నాటి విద్యార్థులకు, ఈనాటి కాలం విద్యార్థులకు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. పూర్వం నాటి విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల ఎనలేని గౌరవమర్యాదలు పాటించేవారని గుర్తుచేశారు. నేటి కాలం విద్యార్థులు కూడా గురువులు చెప్పే ప్రతీ మాటను శ్రద్ధగా వినాలని, తల్లిదండ్రులను మరియు గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కేవలం గొప్ప చదువులు చదవడం మాత్రమే కాకుండా, ఉన్నత విలువలు అలవర్చుకుని సమాజంలో గొప్పవార్లుగా ఎదగాలని పలు మంచి కథలతో ఉదాహరించి వివరించారు.
అలాగే “వందేమాతరం” సంస్థకు 150 సంవత్సరాలు నిండిన సందర్భంగా “వందేమాతరం” అనే నినాదాన్ని విద్యార్థులకు ఇచ్చి ఈ చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల చైర్మన్ శ్రీ ఎమ్.ఎమ్. శలిఫ్ , సిఈఓ శ్రీ శ్రీనివాసరెడ్డి , డైరెక్టర్ రాజ్ కుమార్ , ప్రిన్సిపాల్ నవీన్ గౌడ్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు, విద్యాభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు
దేవరకొండ,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): దేవరకొండ పట్టణంలోని ప్రఖ్యాత కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం ప్రతిభా వికాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ శ్రీ గరికిపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల ప్రతిభా వికాసం గురించి అమూల్యమైన


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply