సంస్థాన్ నారాయణపురం,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
సంస్థాన్ నారాయణపురం మండల సర్వేల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ దోడ యాదిరెడ్డి , సర్పంచ్ చిలకరాజు చందన రాజు గారితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుకు మద్దతు ధర క్వింటాల్‌కు 2,461 ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు, ఎలినీనో ప్రభావం తో నీటి ఎద్దడి కారణంగా రైతులు ప్రత్యామ్యామ పంటలపై దృష్టి సారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్లు గుత్తా శ్రీధర్ రెడ్డి, పగిళ్ల యాదయ్య, తంగేళ్ల సత్తయ్య, ఎర్ర శ్రీశైలం, బిక్కునాయక్ ,సుర్వి తిరుపతి గౌడ్,ఉప సర్పంచ్ కట్కూరి భాస్కర్ గౌడ్, దేవాలయ చైర్మన్ వెనుముల శంకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుత్తా ఉమ ప్రేమ్‌చంద్ రెడ్డి ,ఆర్ ఐ కట్ట పండు, సీఈఓ శ్రీకాంత్ రెడ్డి , వార్డు సభ్యులు, రైతులు, నాయకులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply