Breaking News
దశదిన కర్మకు హాజరై నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్

కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేత

టేకులపల్లి, ఆయుష్ 24 న్యూస్:
టేకులపల్లి (ప) మండలంలోని ఏ కాలనీ తండా గ్రామంలో దరావత్ తులిష దశదిన కర్మ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తులిష చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని కోరం సురేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

— AYUSH 24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *