దేవరకొండ భవిత విద్యా కేంద్రంలో డివిజన్ స్థాయి సమావేశం
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల విద్యపై అవగాహన
దేవరకొండ, ఆయుష్ 24 న్యూస్: దేవరకొండ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భవిత విద్యా కేంద్రంలో శుక్రవారం డివిజన్ స్థాయి ఒకరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీఓలు, ఏఆర్‌పీలు తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ జిల్లా కోఆర్డినేటర్ కత్తుల రవీందర్ హాజరై మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య అందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని వివరించారు.
ప్రతి ఉపాధ్యాయుడు ప్రశస్త్ యాప్ను ఎలా ఉపయోగించాలో ఆయన వివరించారు. యాప్‌లోని వీడియోల ద్వారా అవగాహన పొందడంతో పాటు విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. RPwD Act–2016 ప్రకారం 21 రకాల వైకల్యాలను గుర్తించి ప్రశస్త్ యాప్‌లో నమోదు చేయడం తప్పనిసరి అని తెలిపారు.
రిసోర్స్ పర్సన్లు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు CwSN (Children with Special Needs) విద్యార్థులను ఎలా గుర్తించాలో వివరించారు. చిన్న వయసులోనే పిల్లల్లోని లోపాలను గుర్తించి అవసరమైన సహాయం అందించడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచవచ్చని తెలిపారు.
విద్యార్థుల్లో వైకల్యాలను గుర్తించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఐఈ కోఆర్డినేటర్ కత్తుల రవీందర్, డీఆర్పీలు సైదులు, శివరామకృష్ణ, స్పెషల్ ఎడ్యుకేటర్స్, సీఆర్పీలు పాండు నాయక్, వివిధ మండలాల ఐఈఆర్‌పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
AYUSH 24 NEWS
The Voice of Truth



