Breaking News
డిండి ప్రభుత్వ ఐటీఐలో వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీకి ‘రెండవ విడత వాక్-ఇన్ అడ్మిషన్స్’

డిండి | 05-08-2026

డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండవ విడత వాక్-ఇన్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులు https://iti.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా 2026 ఆగస్టు 5వ తేదీ ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన ట్రేడ్లు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐలను ఎంపిక చేసుకునేందుకు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల వరకు నిర్వహించే “వాక్-ఇన్ అడ్మిషన్స్” కౌన్సెలింగ్లో పాల్గొనాలని సూచించారు.

అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తెలంగాణ ఐటీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపాల్ కోరారు.

– AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

మైనంపల్లి గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

మైనంపల్లి | AYUSH24 NEWS

మైనంపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంసింగ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పుట్టిన ప్రతి శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని, శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకట్, పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, అంగన్‌వాడీ టీచర్లు కమలమ్మ, బుజ్జి, ఆయా కళ్ళమ్మ, ఎంఎల్‌హెచ్‌పీ స్వాతి, ఏఎన్‌ఎం విద్యావతి, ఆశా వర్కర్ ధనమ్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.

తల్లిపాలపై అవగాహన కల్పిస్తూ, బాలింతలకు ఆరోగ్య సూచనలు అందించారు.

– AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లయన్ నారాయణరెడ్డిని సన్మానించిన ఎస్. రాము చౌహాన్

దేవరకొండ | AYUSH24 NEWS

దేవరకొండ ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో ఉత్తమ సేవలు అందించి, శాఖను అభివృద్ధి పథంలో నడిపించిన సీనియర్ అధికారి ఎస్. రాము చౌహాన్ వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తి అని దేవరకొండ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లయన్ నల్లమాద నారాయణరెడ్డి ప్రశంసించారు.

గతంలో పిఠాపురం ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో పనిచేస్తూ ఆల్ ఇండియా స్థాయిలో విశిష్ట గుర్తింపు తీసుకువచ్చిన రాము చౌహాన్, అనంతరం దేవరకొండ ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లో అత్యుత్తమ శాఖలలో ఒకటిగా నిలిపేందుకు విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మలక్‌పేట ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో సీనియర్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాము చౌహాన్ అక్కడ కూడా శాఖను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

బుధవారం మలక్‌పేట ఎల్‌ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో లయన్ నల్లమాద నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా రాము చౌహాన్‌ను కలిసి, దేవరకొండ పట్టణ విశేషాలు, లయన్స్ క్లబ్ కార్యకలాపాల గురించి చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్. రాము చౌహాన్ లయన్ నల్లమాద నారాయణరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించగా, నారాయణరెడ్డి కూడా రాము చౌహాన్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పరస్పరం సత్కరించుకుని ఆప్యాయతలను పంచుకున్నారు.

– AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని | రామగిరి మండలం

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి రామగిరి మండలంలోని జేఎన్‌టీయూ కళాశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, “వన్ టైమ్ సెటిల్‌మెంట్” పేరుతో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు.

ఫీజులు చెల్లించకపోవడంతో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బకాయిల కారణంగా సర్టిఫికెట్లు నిలిచిపోవడంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. అలాగే సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

బీజేపీ ప్రధాన డిమాండ్లు:

  • రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
  • ఫీజు బకాయిల కారణంగా నిలిచిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే విడుదల చేయాలి.
  • 40 లక్షల మంది విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి.
  • ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అత్యవసర ఆర్థిక ఉపశమనం కల్పించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, సీనియర్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

మాతా శిశు సేవలను సద్వినియోగం చేసుకోండి – మంథని ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. టీ.వి. రాజశేఖర్ రెడ్డి

మంథని | 05-08-2026

మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నేడు గైనకాలజిస్ట్ డా. మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ డా. గుంట మౌనిక, చిన్నపిల్లల వైద్య నిపుణుడు డా. చిలకలపల్లి నరేష్ ఆధ్వర్యంలో రెండు సిజేరియన్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సల ద్వారా ఒక బాబు, ఒక పాప జన్మించగా, తల్లి–బిడ్డలు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా మంథని ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. టీ.వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రెగ్యులర్ వైద్యులను నియమించడం వల్ల మంథని ప్రాంతంలోని గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.

ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొంటూ, ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రికి సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా సూచనలు ఉంటే నేరుగా మెడికల్ సూపరింటెండెంట్‌ను 98858 08589 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నందుకు గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు కృతజ్ఞతలు తెలపగా, మంథని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

🖋️ AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిలుకానగర్ బీజేపీ నాయకులు

ఉప్పల్ నియోజకవర్గం | చిలుకానగర్ డివిజన్

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని విశేష సేవలందించిన ఉద్యమకిరీటం, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర స్పెషల్ ఇన్వైటీ, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి శ్రీ బేతి సుభాష్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిలుకానగర్ డివిజన్ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు బేతి సుభాష్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు డప్పు దత్తసాయి, కంటెస్టెడ్ కార్పొరేటర్ గోనె శ్రీకాంత్ ముదిరాజ్, సీనియర్ నాయకులు గోనె అంజయ్య, ఆడేపు అంజయ్య, కావలి నరసింహ, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ శివకుమార్, ఉపాధ్యక్షులు పారుపాటి రామ్ రెడ్డి, పోలోజు శ్రీనివాస్ చారి, నాయకులు ఎక్కలదేవి నర్సింలు, సీకూరి కృష్ణ, రాచకొండ శివకుమార్, కాసుల రావిమకృష్ణ గౌడ్, కార్తిక్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS ప్రతినిధి

ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్ నేనావత్ శివయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ | 05-08-2026

దేవరకొండ మండలం కట్టకొమ్ము తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నేనావత్ శివయ్య ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు శివయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందిస్తున్న నాయకులు పార్టీకి ఎంతో విలువైన ఆస్తి అని ఎమ్మెల్యే బాలు నాయక్ గారు పేర్కొన్నారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు లోకాసాని శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మునుకుంట్ల వెంకట్ రెడ్డి, మండల ఫోరం అధ్యక్షుడు కొర్ర రాంసింగ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, స్థానిక సర్పంచ్ నేనావత్ లచ్చిరాం, సూర్యతండా సర్పంచ్ నేనావత్ కవిత – లచ్చిరాం, వార్డు సభ్యుడు సాగర్ చౌహన్, పగిల్ల చంద్రయ్య, బి. కోఠి, గ్రామస్థులు తదితరులు పాల్గొని శివయ్యకు ధైర్యం చెప్పారు.

AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

కుషాయిగూడ బస్ స్టాప్ సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతి

సానుకూలంగా స్పందించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

ఉప్పల్ నియోజకవర్గం, కుషాయిగూడ | AYUSH24 NEWS

కుషాయిగూడ బస్ స్టాప్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ చలాన్లపై ప్రజల్లో నెలకొన్న ఆందోళన, అలాగే రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల వల్ల బస్సుల రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులపై కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కుషాయిగూడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్లను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బస్ స్టాప్ వద్ద బారికేడ్ల కారణంగా ప్రజలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులు, ముఖ్యంగా వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ట్రాఫిక్ చలాన్ల అమలులో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను కూడా వివరించారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, వాటిని సమగ్రంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ డీసీపీ దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు ఇబ్బందులు తొలగేలా వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కుషాయిగూడ ప్రజల సమస్యలను గుర్తించి సానుకూలంగా స్పందించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్‌లకు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పనగట్ల చక్రపాణి గౌడ్, చల్లా ప్రభాకర్, కొడకండ్ల యాదయ్య, రేగొండ వెంకటేశ్వర్లు, పండాల గణేష్ గౌడ్, బ్రహ్మచారి, నాలచెరువుల జనార్దన్, పిట్టల రాజు ముదిరాజ్, చినంగిని దయానంద్, రమేష్ చౌదరి, నాగరాజు, సకరామ్ చౌదరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ వద్ద అధ్వానంగా రోడ్ల దుస్థితి

బురదలో కూరుకుపోయిన సూపర్ లగ్జరీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

ఉప్పల్ | AYUSH24 NEWS

ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సుల తాత్కాలిక బస్టాప్ వద్ద రోడ్ల దుస్థితి తీవ్రంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బస్టాండ్ పరిసర ప్రాంతం పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్టాప్ వద్ద మట్టి, బురద పేరుకుపోవడంతో ప్రజలు నడవడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు బస్సులు ఎక్కడానికి, దిగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధ్వానంగా మారిన రహదారి కారణంగా ఓ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు సైతం బురదలో కూరుకుపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రజలు, ప్రయాణికులు స్పందిస్తూ బస్టాండ్ పరిసర ప్రాంతంలో వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

అంతర్ రాష్ట్ర పుణ్యక్షేత్రాలకు దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు

దేవరకొండ | AYUSH24 NEWS

దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో “పుణ్యక్షేత్ర దర్శిని” పేరుతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు డీలక్స్, సూపర్ లగ్జరీ (పుష్ బ్యాక్ సీట్లు) ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు.

ప్రస్తుత ఆషాఢ మాసం మరియు రాబోయే శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు తక్కువ సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత కోసం అనుభవజ్ఞులైన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యాత్రలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

🛕 పుణ్యక్షేత్రాల వివరాలు

  • ఆలంపూర్, బీచుపల్లి, శ్రీరంగాపురం, జటప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం
  • ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమురవెల్లి
  • భద్రాచలం, మల్లూరు, మేడారం, రామప్ప దేవాలయం
  • కాలేశ్వరం, భద్రకాళి ఆలయం (వరంగల్), వేయి స్తంభాల గుడి (హనుమకొండ)
  • పంచదేవ్ పహాడ్, మఖ్తల్, మన్యంకొండ, కురుమూర్తి, గంగాపూర్
  • విజయవాడ, పెద్దపులిపాక, పెనుగొండ, వాడపల్లి
  • కొల్హాపూర్, జ్యోతిబా, పండరిపూర్, తుల్జాపూర్, గానగాపూర్
  • మంత్రాలయం, పంచముఖి, దేవసుగూర్, మన్యంకొండ

అంతేకాకుండా, కనీసం 30 మంది భక్తులు ఉంటే వారు కోరుకున్న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ తెలిపారు. అందుబాటు ధరల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఈ సందర్భంగా దేవరకొండ ప్రాంత భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ పుణ్యక్షేత్ర దర్శిని బస్సులను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ యాత్రలను పూర్తి చేసుకోవాలని డిపో మేనేజర్ విజయకుమారి కోరారు.

📞 పూర్తి వివరాలకు: 98488 47419 లేదా దేవరకొండ ఆర్టీసీ డిపోను సంప్రదించవచ్చు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”