Breaking News
ఇల్లందులో BRS పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకానున్న మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

ఇల్లందు, ఆగస్టు 14, ఆయుష్ 24 న్యూస్:
80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందు నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఆగస్టు 15, 2026 శనివారం ఉదయం 8 గంటలకు జేకే కాలనీ వద్ద ఉన్న ఇల్లందు నియోజకవర్గ BRS పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ BRS పార్టీ ఇన్‌చార్జ్ శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ కార్యక్రమానికి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

ఈ సందర్భంగా ఇల్లందు పట్టణ, మండల BRS పార్టీ శ్రేణులు, పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ కార్యాలయం పిలుపునిచ్చింది.

పార్టీ శ్రేణులు నిర్ణీత సమయానికి జేకే కాలనీ వద్ద ఉన్న ఇల్లందు నియోజకవర్గ BRS పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని కోరారు.

— AYUSH 24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *