హయత్‌నగర్ బస్టాండ్‌లో విజయ డైరీ పార్లర్ ప్రారంభం
తెలంగాణ విజయ డైరీ పార్లర్‌ను ప్రారంభించిన డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
హైదరాబాద్, ఆయుష్ 24 న్యూస్:
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ విజయ డైరీ పార్లర్‌ను తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి ప్రారంభించారు. జనరల్ మేనేజర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి ఆయన పార్లర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ డైరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విజయ డైరీ పార్లర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హయత్‌నగర్ బస్టాండ్‌లో పార్లర్ ఏర్పాటుకు స్థల కేటాయింపులో సహకరించిన మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌కు, అలాగే ఆర్టీసీ యాజమాన్యానికి గుత్తా అమిత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విజయ డైరీ పార్లర్ల ఏర్పాటుకు ఆహ్వానం
తెలంగాణ ప్రజలకు విజయ డైరీ తరఫున చిన్న విన్నపం చేస్తున్నామని గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ బస్టాండ్లలో విజయ డైరీ పార్లర్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు విజయభవన్, తార్నాక్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.

ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించడంతో పాటు విజయ డైరీ ఉత్పత్తుల విక్రయాలను మరింత విస్తరించేందుకు ఈ పార్లర్లు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
— AYUSH 24 NEWS

