Breaking News
పీఏ పల్లి మండల అభివృద్ధికి శాఖల వారీగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలి: ఎమ్మెల్యే బాలు నాయక్

పీఏ పల్లి, ఆగస్టు 13: పెద్దఅడిశర్లపల్లి (పీఏ పల్లి) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొని, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో మండల అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల అభివృద్ధికి శాఖల వారీగా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించడమే అధికారుల ప్రధాన బాధ్యత కావాలని అన్నారు.రైతులకు సకాలంలో సేవలు అందించాలివ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సాగు సలహాలు, విత్తనాలు, ఎరువులు, పంటల రక్షణకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందించాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచే ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలిరెవెన్యూ శాఖ పరిధిలోని భూ సమస్యలు, అటవీ శాఖకు సంబంధించిన భూ సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర రెవెన్యూ సేవలను వేగంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు చిన్నచిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అన్నారు.గ్రామాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యతపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, ప్రభుత్వ భవనాలు తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అన్నారు.VB-GRAMG ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వాటి వద్ద మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే నీటి సంరక్షణ, చెరువులు, కాలువలు, మొక్కల పెంపకం వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధవిద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. విద్యార్థుల హాజరు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వైద్య–ఆరోగ్య శాఖ ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. గర్భిణీలు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.తాగునీరు, విద్యుత్ సమస్యలపై తక్షణ స్పందనమిషన్ భగీరథ, విద్యుత్ శాఖలు గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని సూచించారు.అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలిపౌరసరఫరాలు, సంక్షేమ, మహిళా–శిశు సంక్షేమ శాఖలు అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా చూడాలని అన్నారు. అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుడు కూడా ప్రభుత్వ పథకాల నుంచి దూరం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు.పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్య, మార్కెటింగ్ శాఖల అధికారులు రైతులు, గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయ మార్గాలను అందించే పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.సమన్వయంతో పనిచేయాలిముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకురావాలని, ఆ దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.పీఏ పల్లి మండలంలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, పారిశుధ్యం, విద్యుత్ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీవో, ఎమ్మార్వో, మండల ప్రత్యేక అధికారి, పీఏసీఎస్ చైర్మన్ తేరా మణిపాల్ రెడ్డి, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

– అయుష్ 24 న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *