బోయిన్పేట్ ముదిరాజ్ సంఘం కమిటీ హాల్ నిర్మాణానికి ఘనంగా శ్రీకారం
మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రూ.35 లక్షల నిధులు మంజూరు
మంథని: బోయిన్పేట్ ముదిరాజ్ సంఘం కమిటీ హాల్ నిర్మాణ పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. గౌరవ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ప్రత్యేక చొరవతో మొదటి విడతగా రూ.15 లక్షలు, రెండో విడతగా రూ.20 లక్షలు కలిపి మొత్తం రూ.35 లక్షల నిధులు మంజూరయ్యాయి.

మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో కమిటీ హాల్ నిర్మాణ పనులకు ముగ్గు పోసి అధికారికంగా పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీ ముసుకుల సహేందర్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి జంబోజు సమ్మయ్య, ఏఈ శ్రీమతి మౌనికతో పాటు బోయిన్పేట్ ముదిరాజ్ సంఘం పెద్దలు, నాయకులు, సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
బోయిన్పేట్ ముదిరాజ్ సంఘం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సంఘం ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఆయుష్ 24 న్యూస్ | The Voice of Truth
#Ayush24News #Boyinpeta #MudhirajSangam #Manthani #SridharBabu #TelanganaNews

