మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయిలి ప్రసాద్
రెండోసారి మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు.. కార్యకర్తల్లో హర్షం
మంథని: మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయిలి ప్రసాద్ రెండోసారి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ఆయనకు మరోసారి మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి అయిలి ప్రసాద్ కృషి చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం అయిలి ప్రసాద్ చేసిన సేవలను, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని అధిష్టానం గుర్తించి మరోసారి మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
అయిలి ప్రసాద్ మాట్లాడుతూ..
తనపై మరోసారి నమ్మకం ఉంచి మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంథని మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
అయిలి ప్రసాద్ రెండోసారి మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
AYUSH 24 NEWS
The Voice of Truth

