Breaking News
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
  • రైతుల భూసమస్యల పరిష్కారానికి కృషి

పి.ఏ. పల్లి, ఆగస్టు 13: పి.ఏ. పల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యాలయం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు.గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.గ్రామపంచాయతీ కార్యాలయాలు కేవలం పరిపాలనా కేంద్రాలుగా కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికలుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.రైతుల భూసమస్యల పరిష్కారానికి కృషితిరుమలగిరి గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ భూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. రైతుల భూములకు సంబంధించిన పట్టాలు పటిష్టంగా ఉండేలా చూడటం తన బాధ్యతగా తీసుకుంటానని హామీ ఇచ్చారు.తిరుమలగిరి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ బెల్లి కృష్ణవేణి ఆంజనేయులు, మండల అధ్యక్షుడు నెర్మటి సతీష్ రెడ్డి, కుక్కల గోవర్ధన్ రెడ్డి, వీరబోయిన ఎల్లయ్య యాదవ్, ఏవీ రెడ్డి, పాల్వయి వెంకట్ రెడ్డి, ముచర్ల శ్రీకాంత్ యాదవ్, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల పరిధిలోని సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

– అయుష్ 24 న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *