శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత
డిండి, ఆయుష్ 24 న్యూస్: డిండి మండలంలోని ఉమ్మడి వీరబోయనపల్లి గ్రామ పంచాయతీ, ప్రస్తుత శక్రు తండా గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయాన్ని బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ గురువారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయంగా కొంత నగదు విరాళాన్ని అందజేశారు. అనంతరం వడ్త్య రమేష్‌ను ఆలయ నిర్వాహకులు, తండా నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో శక్రు తండా సర్పంచ్ కేతావత్ బాధ్య నాయక్, రామావత్ రెడ్యా నాయక్, నారాయణ్ సింగ్, తావుర్య, రమేష్ నాయక్, దశరథ్, రంజిత్, గన్య, లక్ష్మణ్, యాకూబ్, పుల్ సింగ్, శంకర్, నేనావత్ శ్రీను, శ్రీను, రవీందర్, సిత్య, పాండు, తిరుపతి, నిరంజన్, దేవీలాల్, రెక్కీ లాల్, దశరథం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.ఆలయ నిర్మాణానికి సహకరించిన వడ్త్య రమేష్‌కు తండా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


