Breaking News
హైదరాబాద్‌లో విజయ తెలంగాణ డైరీ పార్లర్ ప్రారంభం
  • నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం

అయుష్ 24 న్యూస్ | హైదరాబాద్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ధర్మ జువెలరీస్ పక్కన ఏర్పాటు చేసిన విజయ తెలంగాణ డైరీ పార్లర్‌ను తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దేవిరెడ్డి నాగార్జున రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ తెలంగాణ డైరీ పార్లర్ ద్వారా ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులకు ప్రజల్లో మరింత ఆదరణ పెంచడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించడమే విజయ తెలంగాణ డైరీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

#VijayaTelanganaDairy #Milk #PureMilk #GuthaAmithReddy #Ayush24News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *