Breaking News
📰 SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ సమావేశం

నిజామాబాద్, ఆయుష్ 24 న్యూస్: SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ AO క్వార్టర్లీ మీటింగ్ నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కుమార్ శెట్టి, DGS కోట సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ సుప్రీం, లేడీ రిప్రజెంటేటివ్ అర్చనతో పాటు ఇతర ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సతీష్ గారి కుటుంబాన్ని అసోసియేషన్ ప్రతినిధులు పరామర్శించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా సతీష్ కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

— AYUSH 24 NEWS
The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *