Breaking News
🚨 అనుమానాస్పద మృతిపై ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శ

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కొండమల్లేపల్లి, ఆగస్టు 12: కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన నాగార్జున స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ శ్రీమతి కళ్లూరూప రెడ్డి గారు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు దేవరకొండ ఆసుపత్రికి చేరుకొని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీయాలని కొండమల్లేపల్లి సీఐని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయని జమున మాధవరెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి వేమన్ రెడ్డి, చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవిందు యాదవ్, మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ కోతి యుగంధర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, కౌన్సిలర్ శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోట్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

— AYUSH 24 NEWS
The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *