🚨 విద్యుత్ షాక్‌తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడ్ మండలంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీ బానోత్ నవీన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దర్‌వారి గూడెం, వెంకటియా తండాకు చెందిన నవీన్.. వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ, ప్రస్తుత సర్పంచ్ శ్రీ బానోత్ దేవ్లా నాయక్ గారి ద్వితీయ కుమారుడిగా సమాచారం.
ఆగస్టు 11, 2026 రాత్రి సుమారు 9 గంటల సమయంలో అడవిలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి అడవి జంతువులను వేటాడుతున్నారనే సమాచారం అందడంతో నవీన్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
నవీన్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు — ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్‌కు AYUSH 24 NEWS తరఫున ఘన నివాళులు.
🌹 శ్రద్ధాంజలి 🌹
🙏 ఓం శాంతి 🙏
— AYUSH 24 NEWS
The Voice of Truth

