Breaking News
మిర్యాలగూడను ఆరోగ్య మిర్యాలగూడగా తీర్చిదిద్దాలి: బీఎస్ఎన్ఎల్ శ్రీనివాస్

ప్రతి ఇంటి నుంచి చిన్నారులు, పెద్దలు కరాటే నేర్చుకోవాలి

100 మంది కరాటే విద్యార్థులకు సొరకాయల పంపిణీ

మిర్యాలగూడ, ఆగస్టు 9, 2026:మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డులో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కరాటే ప్రాక్టీస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం 100 మంది కరాటే విద్యార్థిని, విద్యార్థులకు సొరకాయలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి బీఎస్ఎన్ఎల్ శ్రీనివాస్, జననేత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ శ్రీహరి నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని “ఆరోగ్య మిర్యాలగూడ”గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి నుంచి చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.జననేత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని ప్రతి మహిళ తప్పనిసరిగా కరాటే శిక్షణ తీసుకోవాలని సూచించారు. మహిళలకు ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ శ్రీహరి నాయక్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో రామకృష్ణ మాస్టర్ వద్ద కరాటే శిక్షణ పొందానని తెలిపారు. ఆ శిక్షణ తన జీవితంలో ఎంతో ఉపయోగపడిందని, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నానని చెప్పారు. అలాగే ఆగస్టు 16న చెన్నైలో నిర్వహించనున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు వెల్లడించారు.సీనియర్ కరాటే మాస్టర్ బండవత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా మిర్యాలగూడ పట్టణంలో ఎంతోమంది పేద విద్యార్థులకు కరాటే శిక్షణa అందిస్తున్నట్లు తెలిపారు. తమ వద్ద శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించారని చెప్పారు. కొందరు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.చదువు ఎంత ముఖ్యమో కరాటే కూడా అంతే అవసరమని రామకృష్ణ నాయక్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక చిన్నారినైనా కరాటే శిక్షణలో చేర్పించాలని కోరారు. “మిర్యాలగూడను ఆరోగ్య మిర్యాలగూడగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శివ భారతి, అజయ్, కార్తికేయ, ప్రవళిక, ఉష్ణ తదితరులు పాల్గొన్నారు.— AYUSH24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *