Breaking News
ఆషాఢ బోనాల సందర్భంగా ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 9, 2026 | అయుష్24 న్యూస్

ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి నూతన పట్టువస్త్రాలను అధికారికంగా సమర్పించారు.ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, వేద అర్చకులు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. గత సంవత్సరం కూడా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు గుర్తుచేశారు.ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండాలని, తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అలంపల్లి నర్సింహా, ఉప్పుగూడ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, వేద అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి — అయుష్24 న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *