Breaking News
నేనావత్ సతీష్ మృతి బాధాకరం – దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

పడమటి తండాలో సతీష్ మృతదేహానికి నివాళులు అర్పించిన రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ: నేరడుగొమ్ము మండలం పడమటి తండాకు చెందిన BRS వార్డ్ మెంబర్ నేనావత్ మంగ్ల గారి పెద్ద కుమారుడు నేనావత్ సతీష్ మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం పడమటి తండాలో సతీష్ మృతదేహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సతీష్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ PACS చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, మాజీ వైస్ ఎంపీపీ అరేకంటి రాములు, మాజీ సర్పంచ్ పల్స వెంకటయ్య, గుండాల వెంకట్ యాదవ్, కుంటిగోర్ల నాగరాజు, బైకం సాయి యాదవ్, మంగ్య నాయక్, పూస యాదయ్య, ముఖం మల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.— Ayush24 News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *