అంతర్ రాష్ట్ర పుణ్యక్షేత్రాలకు దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు
దేవరకొండ | AYUSH24 NEWS
దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో “పుణ్యక్షేత్ర దర్శిని” పేరుతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు డీలక్స్, సూపర్ లగ్జరీ (పుష్ బ్యాక్ సీట్లు) ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు.
ప్రస్తుత ఆషాఢ మాసం మరియు రాబోయే శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు తక్కువ సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత కోసం అనుభవజ్ఞులైన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యాత్రలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
🛕 పుణ్యక్షేత్రాల వివరాలు
- ఆలంపూర్, బీచుపల్లి, శ్రీరంగాపురం, జటప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం
- ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమురవెల్లి
- భద్రాచలం, మల్లూరు, మేడారం, రామప్ప దేవాలయం
- కాలేశ్వరం, భద్రకాళి ఆలయం (వరంగల్), వేయి స్తంభాల గుడి (హనుమకొండ)
- పంచదేవ్ పహాడ్, మఖ్తల్, మన్యంకొండ, కురుమూర్తి, గంగాపూర్
- విజయవాడ, పెద్దపులిపాక, పెనుగొండ, వాడపల్లి
- కొల్హాపూర్, జ్యోతిబా, పండరిపూర్, తుల్జాపూర్, గానగాపూర్
- మంత్రాలయం, పంచముఖి, దేవసుగూర్, మన్యంకొండ
అంతేకాకుండా, కనీసం 30 మంది భక్తులు ఉంటే వారు కోరుకున్న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ తెలిపారు. అందుబాటు ధరల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఈ సందర్భంగా దేవరకొండ ప్రాంత భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ పుణ్యక్షేత్ర దర్శిని బస్సులను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ యాత్రలను పూర్తి చేసుకోవాలని డిపో మేనేజర్ విజయకుమారి కోరారు.
📞 పూర్తి వివరాలకు: 98488 47419 లేదా దేవరకొండ ఆర్టీసీ డిపోను సంప్రదించవచ్చు.
– AYUSH24 NEWS
“The Voice of Truth”

