గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన సత్పతి ఇంజనీర్
శాశ్వత కట్టడాల నిర్మాణంపై పరిశీలన – పకడ్బందీగా నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక
దేవరకొండ, ఆగస్టు 11:దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సత్పతి ఇంజనీర్ బృందం మంగళవారం సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించింది.దేవాలయ నిర్మాణంలో భాగంగా రాజగోపురాలు, ధ్వజస్తంభం, వాస్తు పిల్లర్స్, వివిధ నిర్మాణ కట్టడాలు తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నిర్మాణపరమైన ఎలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన ఆలయ నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక అంశాలను పరిశీలించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా సత్పతి వలి నాయక్, ప్రముఖ ఇంజనీర్ అచ్చురలను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ పరిసరాలు, ప్రస్తుతం ఉన్న నిర్మాణ పరిస్థితులు, భవిష్యత్ నిర్మాణ అవసరాలకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి అందించారు. అనంతరం వారి సూచనల మేరకు బిల్డింగ్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఇంజనీర్లు మాట్లాడుతూ ఆలయ నిర్మాణాన్ని అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, పకడ్బందీగా చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణం దీర్ఘకాలం మన్నికగా ఉండేలా, సుమారు 200 నుంచి 300 సంవత్సరాల వరకు ఎలాంటి శిథిలాలు లేదా నిర్మాణపరమైన సమస్యలు తలెత్తకుండా అవసరమైన సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు అలంపల్లి నరసింహ, ప్రధాన కార్యదర్శి దొడ్డి సుధాకర్, కోశాధికారి శిరందాసు కృష్ణయ్య, దొడ్డి వెంకటేశ్వర్లు, పానుగంటి మల్లయ్య, పొనుగోటి జనార్దన్ రావు, నక్క వెంకటేష్ యాదవ్, రామాచారి, బిఆర్ గౌడ్ తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
— దేవరకొండ | AYUSH24 NEWS
The Voice of Truth

