Breaking News
వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు

వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు

దేవరకొండ, ఆగస్టు 10 – AYUSH24 NEWS:దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర బిక్షపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం దేవరకొండ పట్టణంలోని మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు చేనమౌని రాములు ముదిరాజ్ మాట్లాడుతూ.. ఎర్ర బిక్షపతి పేద ప్రజల సేవ కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి అని అన్నారు. పార్టీని తండాల నుంచి పల్లెల వరకు బలోపేతం చేయడంలో ఆయన కీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణకు ఎర్ర బిక్షపతి మారుపేరు అని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అధిరోహించి, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అనంతరం వృద్ధుల సమక్షంలో ఎర్ర బిక్షపతిని శాలువాతో ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ వస్కుల సుధాకర్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ జెల్డా భాస్కర్, నేతల వెంకటేష్, నేరేడుగొమ్ము మండల అధ్యక్షులు నాగిళ్ల అంజి, సముద్రాల సహాదేవ్, సిహెచ్. బిక్కు, గంజి హరీకుమార్, విజయకుమార్, ఎర్ర గిరి, అవ్వారి శేఖర్, సత్యం తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

— AYUSH24 NEWS

The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *