ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి
— సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
దేవరకొండ, ఆయుష్24 న్యూస్:ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు.సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన ప్రజా చైతన్య ప్రచార యాత్ర సోమవారం నేరడిగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి, పెద్దమునిగల్, కొత్తపల్లి, పర్వాల, నేరడిగొమ్ము, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పల్లా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితులను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, యువత నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కంటి తుడుపు చర్యలు చేపడుతోందని దేవేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు.దేశంలోని విద్యారంగంతో పాటు అనేక రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల వ్యవస్థలు బలహీనపడుతున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ అంశాలను ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న యువతపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసి, బెదిరింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందక శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతున్న పరిస్థితుల్లో నిరుద్యోగాన్ని మరింత పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వ పరిశ్రమల ఏర్పాటు లేకపోగా, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని అన్నారు.ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడుతోందని పల్లా దేవేందర్ రెడ్డి విమర్శించారు. దేవుళ్ల పేరుతో చేసే రాజకీయాలు ఎంతోకాలం కొనసాగవని అన్నారు.ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మైనొద్దిన్, నేరడిగొమ్ము మండల కార్యదర్శి బొమ్ము రామాంజనేయులు, దేవరకొండ మండల కార్యదర్శి ఉప్పునూతల వెంకటయ్య, చందంపేట మండల కార్యదర్శి సుదర్శన్ రెడ్డి తదితర నాయకులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.అలాగే రామస్వామి, పల్లా రంగారెడ్డి, ఎం. వెంగలయ్య, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు దేవీలాల్, రమేష్, శివ, బిక్షమయ్య, సురేష్, ఆంజనేయులు, వెంకటాచారి, నరేందర్, చందు, బక్కయ్య, మల్లయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
.— AYUSH24 NEWS
The Voice of Truth

