ఇస్లాంపూర్‌లో నూతన రేషన్ దుకాణం ప్రారంభం
వినియోగదారులకు మరింత చేరువలో సేవలు – మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు
దేవరకొండ | ఆగస్టు 1 | AYUSH 24 NEWS
దేవరకొండ పట్టణంలోని ఇస్లాంపూర్‌లో రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో నూతన రేషన్ దుకాణాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, రేషన్ డీలర్ ఉమర్, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు, రేషన్ కార్డు వినియోగదారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందన్నారు. దేశంలో పేద ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు.
రేషన్ వినియోగదారులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా తమ వార్డులోనే సులభంగా రేషన్ పొందేలా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చొరవతో ఈ నూతన రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ దుకాణం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 4వ వార్డు కౌన్సిలర్ ఎండి రయీస్, మాజీ ఎంపీటీసీ పొన్నెబోయిన సైదులు, కౌన్సిలర్లు పులిజాల భవాని జానీ, ఎస్.కె. నవీద్, గాజుల సావిత్రి మురళి, వై.ఎస్. కరుణాకర్, బత్తుల అమర్, కుంచకూరి మధు, అజీమొద్దీన్, సుభాష్, మత పెద్దలు, కాలనీవాసులు, రేషన్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించడంలో ఈ నూతన రేషన్ దుకాణం కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
📰 AYUSH 24 NEWS
“నిజం… నిష్పక్షపాతంగా… ప్రజలతో… ప్రజల కోసం.”
#AYUSH24NEWS #Devarakonda #IslamPur #RationShop #Telangana #PublicDistributionSystem #FineRice #BaluNaik #PunnaShailaja #Congress

