జాతీయ కరాటే పోటీలకు ఢిల్లీకి ఎంపికైన మంథని విద్యార్థులు
మంథని, పెద్దపల్లి జిల్లా:
ఢిల్లీలోని తాల్కటోర ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్న జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్ షిటోరియు శికోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ విద్యార్థినీ, విద్యార్థులు ఎంపిక కావడం విశేషం.
అకాడమీ శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు సబ్ జూనియర్స్ కతా, కుమితే మరియు జూనియర్స్ కతా, కుమితే విభాగాల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
ఎంపికైన విద్యార్థులు:
🥋 ఎలా వేనా నిషిత్ – 30 కేజీల విభాగం
🥋 మారేడుకొండ రిషి – 25 కేజీల విభాగం
🥋 ఆదిమూలపు అభిజ్ఞ సిరి – 35 కేజీల విభాగం
🥋 ఎం.డి. తహసీన్ తైబా – జూనియర్స్ కతా & కుమితే, 76 కేజీల విభాగం
జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులను షిటోరియు శికోకాయ్ కరాటే ఇండియా & KIO అధ్యక్షులు పి. భరత్ శర్మ, తెలంగాణ షిటోరియు శికోకాయ్ కరాటే రిప్రజెంటేటివ్ పాలకుర్తి పాపయ్య, కార్యనిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే-డో అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి, సీనియర్ కరాటే శిక్షకులు చైతన్య, అలాగే ఇన్స్ట్రక్టర్లు నాగళ్లి రాకేష్, కావేటి శివ, గణేష్, జడగల శివ అభినందిస్తూ, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణకు, మంథని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

