Breaking News
SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ EC సమావేశం

OBC ఉద్యోగుల సమస్యలు, సభ్యత్వం, భవిష్యత్ కార్యక్రమాలపై విస్తృత చర్చ

హైదరాబాద్, ఆగస్టు 9, 2026:SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సమావేశం ఈరోజు పర్వాన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు NVT, ప్రధాన కార్యదర్శి K. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో ఇటీవల నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం విజయవంతం, అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం, సభ్యత్వ నమోదు, AGS, RS, ARS పరిచయ కార్యక్రమం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.అలాగే వివిధ AOలలో OBC ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, జనరల్ బాడీ సమావేశం మరియు కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఖర్చులు తదితర అంశాలను చర్చించారు. ప్రతి AO పరిధిలో OBC ఉద్యోగుల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.ఈ EC సమావేశాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని AOల DGS, వైస్ ప్రెసిడెంట్లు, AGSలు, RSలు, ARSలు, లేడీ రిప్రజెంటేటివ్‌లకు అసోసియేషన్ నాయకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా జనరల్ బాడీ సమావేశం, కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి OBC సభ్యుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశానికి హైదరాబాద్ విచ్చేసిన ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ రామ్ సింగ్ యాదవ్, అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ సంతోష్, గుజరాత్ ప్రెసిడెంట్ రాజేష్లకు అసోసియేషన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు.OBC ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం, సంఘటిత శక్తి పెంపొందించడం, సభ్యత్వాన్ని మరింత విస్తరించడం వంటి అంశాలపై భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.— AYUSH24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *