Breaking News
ఆషాఢ మాసంలో ఘనంగా గోరింటాకు సంబరాలు

అయ్యప్ప కాలనీ మహిళల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమం

దేవరకొండ | అయుష్ 24 న్యూస్ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని దేవరకొండలోని అయ్యప్ప కాలనీ మహిళల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం ఘనంగా గోరింటాకు సంబరాలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరీ పూజను నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం మహిళలంతా ఒకే చోట చేరి సంప్రదాయ పద్ధతిలో గోరింటాకును రోకళ్లతో దంచి, ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు.గోరింటాకు మహిళలకు శారీరకంగా చల్లదనాన్ని కలిగించడంతో పాటు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దేవతల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోందని వివరించారు.గోరింటాకు పెట్టుకున్న అనంతరం మహిళలు సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రాముఖ్యతను వివరిస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప కాలనీ మహిళలు, భక్తులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

📍 దేవరకొండ

📰 అయుష్ 24 న్యూస్

– ప్రజల గొంతుక, నిజానికి నడక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *