ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
విజయ భవన్‌లో మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
హైదరాబాద్ | AYUSH24 NEWS
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లాలాపేటలోని విజయ భవన్‌లో ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు, ఎం.డి. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, IAS గారితో కలిసి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేయడంలో ఆచార్య జయశంకర్ గారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమకారుడైన ఆచార్య జయశంకర్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
— AYUSH24 NEWS

