Breaking News
ఆర్థిక సహాయం అందించిన దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు

దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం

ఇంటికి వెళ్లి పరామర్శించి అండగా ఉంటామని హామీ

దేవరకొండ | AYUSH24 NEWS

అనారోగ్యంతో బాధపడుతూ దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబానికి దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు రూ.5,000 ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

దేవరకొండ పట్టణంలోని 4వ వార్డు సంజయ్ కాలనీకి చెందిన దువ్వ వెంకటేశ్వర్లు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో చికిత్స, జీవనోపాధి కోసం సహాయం అందించాలని పత్రికల ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ విషయాన్ని AYUSH24 NEWSలో ప్రచురితమైన కథనం ద్వారా తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు గురువారం వెంకటేశ్వర్లు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని తక్షణ సహాయంగా తన వంతుగా రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వెంకటేశ్వర్లు కుటుంబం ధైర్యంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగించాలని సూచించారు. కష్టకాలంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాలని, అవసరమైన సహకారం అందించేందుకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, సుమంత్ భార్గవ్, ముసిని అంజన్, గుండు నరేష్, పగిడిమర్రి శివ తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *