ఎర్రగడ్డలో ఘనంగా నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 9: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఎస్. శంకర్ నగర్‌లో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో, అలాగే డాన్ బాస్కో స్కూల్ ఆవరణంలో నిర్వహించిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి బోనాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బోనాల పండుగను నిర్వహిస్తున్న ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకు గుత్తా అమిత్ రెడ్డి హృదయపూర్వక బోనాల శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.— Ayush24 News#Ayush24News #LashkarBonalu #LashkarBonalu2026 #TelanganaBonalu #GuthaAmitReddy #Bonalu2026 #Erragadda #Nallapochamma


