Breaking News
చేనేత అభివృద్ధికి 20 ఏళ్లుగా విశిష్ట సేవలు

కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు–2026 అందుకున్న ప్రముఖ చేనేత డిజైనర్ సూరేపల్లి వెంకటేశ్వర్లు

హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకల్లో సూరేపల్లి వెంకటేశ్వర్లు ప్రతిష్టాత్మక కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు–2026ను డిజైనర్ విభాగంలో అందుకున్నారు.సుమారు 20 ఏళ్లుగా చేనేత రంగంలో సేవలందిస్తున్న వెంకటేశ్వర్లు, పోచంపల్లి డబుల్ ఇకట్ డిజైన్లలో విశేష నైపుణ్యాన్ని కనబరిచారు. పద్మశ్రీ గజం అంజయ్య వద్ద పనిచేస్తూ డిజైనింగ్, నాణ్యతాభివృద్ధి, ఉత్పత్తి పర్యవేక్షణలో అనుభవాన్ని సంపాదించారు.దేవరకొండ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం కలిగిన ఆయన గతంలో “చేనేత కళాక్షేత్రం” ఏర్పాటు చేసి మహిళలు, వితంతు మహిళలు, గ్రామీణ యువతకు ఉచితంగా చేనేత శిక్షణ అందించారు. అలాగే దేవరకొండ ప్రాంతంలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు మాత్రమే కాకుండా తన గురువు, చేనేత కార్మికులు, కుటుంబ సభ్యులు, తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమని తెలిపారు. దేవరకొండ ప్రాంతంలో మళ్లీ మగ్గాల శబ్దం వినిపించే వరకు తన ప్రయత్నం కొనసాగుతుందని పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న సూరేపల్లి వెంకటేశ్వర్లుకు చేనేత కార్మికులు, శిష్యులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.📍 దేవరకొండ | AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *