తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన అడిషనల్ కలెక్టర్ ఎన్. పవన్ కుమార్, ఆర్డీఓ పద్మప్రియ
పుట్టిన గంటలోపే ముర్రుపాలు ఇవ్వాలి.. ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే ఉత్తమం – ఆర్డీఓ పద్మప్రియ
AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026
దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పోస్టర్ను అడిషనల్ కలెక్టర్ ఎన్. పవన్ కుమార్ మరియు ఆర్డీఓ పద్మప్రియ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ పద్మప్రియ మాట్లాడుతూ, ప్రసవానికి సమీపంలో ఉన్న ప్రతి గర్భిణీ కుటుంబాన్ని సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు (Colostrum) తప్పనిసరిగా ఇవ్వాలని, అలాగే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలను మాత్రమే అందించాలని సూచించారు.
తల్లిపాలలో సహజసిద్ధమైన వ్యాధి నిరోధక శక్తి ఉండటంతో పాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, ముఖ్యంగా జ్ఞాపకశక్తి (IQ స్థాయి) పెరుగుదలకు ఎంతో దోహదపడుతుందని ఆమె వివరించారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి శిశువుకు పూర్తిస్థాయిలో అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ శ్రీమతి నిర్మల, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
– AYUSH24 NEWS | The Voice of Truth

