Breaking News
దేవరకొండలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఆదివాసీలకు ఘన సత్కారం.. సంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహనకు పిలుపు

దేవరకొండ, ఆగస్టు 11:ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు) లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 80 మంది ఆదివాసీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆదివాసీలను ఘనంగా సత్కరించి, వారి సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత, ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆదివాసీ సమాజం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా డీటీడీఓ, నల్లగొండ పి. కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతికి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అందించేందుకు కృషి చేయాలని సూచించారు.ఆదివాసీల గొప్ప సంస్కృతి, సంప్రదాయాలపై యువతలో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏటీడీఓ ఎం. శ్రీనివాస్, హెచ్‌ఎం ఎ. కవిత, హెచ్‌డబ్ల్యూఓ ఈ. శేఖర్ రెడ్డి, ట్రైబల్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఎంలు, హెచ్‌డబ్ల్యూఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

— దేవరకొండ | AYUSH24 NEWS

The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *