మాతా శిశు సేవలను సద్వినియోగం చేసుకోండి – మంథని ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. టీ.వి. రాజశేఖర్ రెడ్డి
మంథని | 05-08-2026
మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నేడు గైనకాలజిస్ట్ డా. మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ డా. గుంట మౌనిక, చిన్నపిల్లల వైద్య నిపుణుడు డా. చిలకలపల్లి నరేష్ ఆధ్వర్యంలో రెండు సిజేరియన్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సల ద్వారా ఒక బాబు, ఒక పాప జన్మించగా, తల్లి–బిడ్డలు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా మంథని ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. టీ.వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రెగ్యులర్ వైద్యులను నియమించడం వల్ల మంథని ప్రాంతంలోని గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొంటూ, ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రికి సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా సూచనలు ఉంటే నేరుగా మెడికల్ సూపరింటెండెంట్‌ను 98858 08589 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నందుకు గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు కృతజ్ఞతలు తెలపగా, మంథని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
🖋️ AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

